క్యూట్ క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న క్రేజీ భామ అదా శర్మ.. 

28 April 2025

Rajeev 

 అందాల ముద్దుగుమ్మ అదా శర్మ ఎక్కువగా హిందీ,  తెలుగు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. 

2008లో హిందీ హారర్ సినిమా 1920తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా విజయవంతమై, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

2014లో హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించింది. ఈ సినిమాలో థన్ నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది

ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , గరం , క్షణం వంటి విజయవంతమైన తెలుగు సినిమాల్లో నటించింది.

2023లో విడుదలైన ది కేరళ స్టోరీ సినిమా అదా శర్మకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ చిత్రం దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో తీసి, 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆతర్వాత హిందీలో ఈ చిన్నది వరుస ఆఫర్స్ అందుకుంది. 

అదా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది, తన డాన్స్ వీడియోలు, ఫిట్‌నెస్ ఫోటోలు, ఫన్నీ మీమ్స్‌తో అభిమానులను అలరిస్తుంది