ఆ పని చేసినందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నా..

5 August 2023

టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌లో చేయడంతో చాలామంది ట్రోల్‌ చేశారని తెలిపారు నటుడు అబ్బాస్‌.

అయితే వాటి గురించి అస్సలు బాధపెట్టలేదని, పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కల్పించాలనే ఆ యాడ్‌లో నటించానని అన్నారు.

‘‘ఆ యాడ్‌లో నేను చేసినప్పుడు నన్ను వెక్కిరిస్తూ వీడియోలు క్రియేట్‌ చేశారు.

అయితే వాళ్ల విమర్శలకు నేను బాధపడలేదు.

పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించా.

ఆ యాడ్‌ ఆఫర్‌ వచ్చినప్పుడు నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు.

అంతేకాకుండా, వాళ్లు నాకు మంచి పారితోషికం ఇచ్చారు. దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్‌ కుదిరింది.

అలా, వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించా. కాబట్టి అందులో తప్పు ఏముంది.’’ అన్నారు అబ్బాస్‌.