ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార సమంత. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది.
వరుస విజయాలతో దూసుకుపోతూ రెమ్యునరేషన్‌ను పెంచుకుంటూ పోతూనే ఉంది.
ఒకానొక సమయంలో సౌత్‌లో అత్యంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుందీ బ్యూటీ.
ఓ బేబీ మూవీ తర్వాత సమంతకు మళ్లీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. వరుస అపజయాలు ఎదురయ్యాయి.
జాను, యశోద, శాకుంతలం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. అయితే ఖుషీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిందీ బ్యూటీ.
ఈ సినిమాతో సమంత కెరీర్ మళ్లీ గాడిన పడింది. అయితే అనూహ్యంగా సమంత ఈ సినిమాకు తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవడం గమనార్హం.
అది కూడా సినిమాకు సైన్ చేసిన తర్వాత రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవడం విశేషం. సామ్ రూ. కోటి రెమ్యునరేషన్‌ను తక్కువ తీసుకుంది.
నిజానికి ఖుషీ మూవీకి సైన్ చేసే సమయంలో సమంత రూ. 4.5 కోట్లు తీసుకోవడానికి సైన్ చేసింది. కానీ సినిమా విడుదలకు ముందు రూ. కోటి రెమ్యునరేషన్‌ను స్వయంగా తగ్గిచుకుంది.