TV9 Telugu

12 March 2024

సీత దశ మారినట్లేనా.? 

సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార సీతారామం. తొలి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. 

ట్రెడిషనల్‌ లుక్‌లో నటించిన ఈ చిన్నది తన అద్భుత నటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ చిన్నది.

ఈ సినిమా తర్వాత మళ్లీ నాని హీరోగా తెరకెక్కిన హాయ్‌ నాన్న చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుందీ చిన్నది. 

అయితే తాజాగా మృణాల్‌ క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్న తెలుస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం మృణాల్‌ ప్రభాస్‌కు జోడిగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి త్వరలో ఓ పీరియాడికల్‌ డ్రామా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ని ఎంపిక చేశారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మృణాల్‌ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ వార్తే నిజమైతే మృణాల్‌ కెరీర్‌ దిశ మారినట్లే.