తగ్గేదేలే.. జాతీయ అవార్డుల్లో తెలుగోడు సత్తా చాటాడు. 69వ జాతీయ అవార్డుల వేడుకలో తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండింది.
అల్లు అర్జున్ పుష్ప మూవీకి 2 అవార్డులు రాగా.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు వరించాయి
ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డు దక్కింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా తెలుగు నటుడికి ఈ జాతీయ అవార్డు దక్కడం విశేషం. తగ్గేదేలే అన్నట్టుగా పుష్పరాజ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల్లో పలు క్యాటగిరీల్లో అవార్డులు వరించాయి. మరి ఇంతకీ తెలుగు చిత్రాలకు ఏయే క్యాటగిరీలలో అవార్డులు దక్కాయో చూసేద్దాం పదండి.
ఉత్తమ తెలుగు చిత్రం - ఉప్పెన, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(పుష్ప- ది రైజ్), ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్(RRR), బెస్ట్ లిరిక్స్- చంద్రబోస్( కొండపొలం)ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - కాలభైరవ(RRR కొమురం భీముడో)
10 జాతీయ అవార్డులతో తెలుగు సినిమా వీరవిజృంభణ చేసింది. పుష్ప సినిమాకి 2, RRRకి 6, కొండపొలం, ఉప్పెనకి ఒక్కో అవార్డు వరించాయి. స్పెషల్ ఎఫెక్ట్స్, కొరియోగ్రఫీ, యాక్షన్ డైరెక్షన్ కేటగిరీల్లో RRRకి అవార్డ్‌లు వచ్చాయి.
బెస్ట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ - ఎం. ఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్), బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ - దేవిశ్రీప్రసాద్(పుష్ప), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్(మేల్) - కాలభైరవ(కొమురం భీముడో) అవార్డులు వరించాయి.