అంతర్జాతీయ క్రికెట్‌లో భారీ రికార్డ్.. తొలి జట్టుగా ఇంగ్లండ్..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారీ రికార్డు సృష్టించింది.
2000 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్రపంచంలోనే తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.
పాకిస్థాన్‌తో ముల్తాన్ టెస్ట్ మ్యాచ్ రాకతో, ఇంగ్లీష్ జట్టు ఈ భారీ రికార్డును సాధించింది.
ఇంగ్లండ్ జట్టు 1877 నుంచి 2022 వరకు మొత్తం 2000 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.
ఇందులో ఇప్పటి వరకు 864 మ్యాచ్‌లు గెలిచి 734 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.
1877 నుంచి 1995 మ్యాచ్‌లు ఆడి 1084 మ్యాచ్‌లు గెలిచి 643 మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.
1932 నుంచి 1775 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు, 822 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో ఉంది.
అలాగే టీమిండియా 671 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది.
ఈ జాబితాలో పాకిస్థాన్ జట్టు 1608 మ్యాచ్‌లు ఆడిన నాలుగో స్థానంలో ఉంది.