మీ దగ్గర ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఈ పత్రాలతో ఓటు వేయవచ్చుః

28 November 2023

మీ దగ్గర ఓటరు కార్డు లేకున్నా ఆధార్ కార్డును చూపించి మీరు ఓటు హక్కు ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు.

ఆధార్ కార్డ్

మీ వద్ద ఓటరు కార్డు లేనిపక్షంలో మీ పాస్ పోర్ట్‌ను చూపించి కూడా నిర్భయంగా మీరు ఓటు వేసేందుకు వీలుంటుంది.

పాస్‌పోర్ట్

మీ దగ్గర ఉన్న ఓటరు కార్డు తప్పిపోతే మీరు ఉపయోగిస్తున్న డ్రైవింగ్ లైసెన్స్‌ను చూపి కూడా మీరు ఓటు వేయొచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్

మీ ఓటరు ఐడి పోగొట్టుకొన్నట్లైది అధికారులకు పాన్ కార్డు‌ను చూపించి కూడా మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

PAN కార్డ్

మీ ఓటరు కార్డు లేకపోతే ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్‌ను చూపించి మీరు ఓటు వేయొచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్

మీ ఏరియాలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన గుర్తింపు కార్డును చూపించి మీరు ఓటు వేయొచ్చు.

అధికారిక గుర్తింపు కార్డ్

అలాగే పెన్షన్ వస్తున్నట్లైతే ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్‌ను చూపించి కూడా మీరు ఓటును వినియోగించుకోవచ్చు.

పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటోతో)

మీ ఓటర్ ఐడి మిస్ అయితే మీ దగ్గర ఉన్న సర్వీస్ గుర్తింపు కార్డును చూపించి మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

సర్వీస్ ఐడెంటిటీ కార్డ్