ఈసీ చెప్పే ఈ 10 విషయాలు గుర్తు పెట్టుకోండి..!

TV9 Telugu

17 March 2024

ఎన్నికల్లో ద్వేషపూరిత ప్రసంగాలకు తావు లేదు. నాయకులు, కార్యకర్తలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే వారిపై కఠిన చర్యలు.

ఒక నాయకుడు కానీ, అతని అనుచరులు గానీ డబ్బును రహస్యంగా ఉపయోగిస్తే, అక్రమ మార్గంలో తరలించే డబ్బు విషయంలో కఠినంగా వ్యవహారిస్తామన్నారు సీఈసీ.

ఎన్నికల సమయంలో ఎవరైనా సోషల్ మీడియా లేదా ఏ ఇతర మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ పట్టుబడితే వారిపై కఠిన చర్యలు.

నేర చరిత్ర ఉన్న నేతలకు ఎందుకు టిక్కెట్లు ఇచ్చారో రాజకీయ పార్టీలు వివరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

అన్ని పార్టీల స్టార్ క్యాంపెయినర్లు వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. రాజకీయ పార్టీలు తమ ప్రచారాలలో చిన్న పిల్లలను ఉపయోగించవద్దు.

ఏదైనా రాజకీయ పార్టీ తప్పుడు ప్రకటనలు ఇవ్వాలని ప్రయత్నిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు కులం, మతం గురించి మాట్లాడకూడదని భారతీయ ఎన్నికల సంఘం పేర్కొంది.

సోషల్ మీడియాలో ఏ నాయకుడిపైన గానీ, అభ్యర్థులపై పరువు నష్టం కలిగించే పోస్ట్‌లను చేయవద్దని కమిషన్ అన్ని పార్టీలకు ఆదేశాలు.

రాజకీయ పార్టీలు తమ సంస్థలకు సరైన సలహాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. అన్ని పార్టీలు సంస్థ పనితీరును పారదర్శకంగా ఉంచాలని కమిషన్ పేర్కొంది.

ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.