'నా ఒక్క ఓటు వేయకుంటే ఏమౌతుందిలే..' అనుకుంటున్నారా?
May 13, 2024
TV9 Telugu
TV9 Telugu
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల జాతర ప్రారంభమైంది. తెలంగాణలో 17, ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. వీటితోపాటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు కూడా నేడే పోలింగ్ జరుగుతుంది
TV9 Telugu
దీంతో చాలా మంది ఓటు ఉన్నా.. ఓటు వేసేందుకు ఆసక్తి చూపించకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు. వరుస సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి షికార్లకు వెళ్తున్నారు
TV9 Telugu
మరోవైపు తీవ్రమైన ఎండలకు తోడు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాలనే ఉద్ధేశ్యంతో, తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు
TV9 Telugu
నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే ధీమాతో చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఇలాంటి అపోహలు వీడి బాధ్యతగా ఓటు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7-9 మధ్య పెద్దగా క్యూలు ఉండవు. ధ్రువపత్రాలతో 10-15 నిమిషాల్లోనే ఓటేసి బయటకు రావచ్చు
TV9 Telugu
సాధారణంగా సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఎన్నికల కమిషన్ దానిని సాయంత్రం 6 వరకు పెంచింది. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లకూడదు
TV9 Telugu
ఓటు వేసేటప్పుడు స్లిప్ కనిపించే వరకు కనీసం 7 సెకన్లపాటు బటన్‌ను నొక్కి ఉంచాలి. బీప్ ధ్వని వచ్చే వరకు బటన్ నొక్కాలి. అనంతరం VVPAT స్లిప్‌తో మీ ఓటును ఎవరికి వేశారో నిర్ధారించుకోవాలి
TV9 Telugu
పోలింగ్ కేంద్రం దూరంగా ఉన్నవారికి రాపిడో ఉచిత రైడ్ సౌకర్యం ఉంటుంది. బుక్ చేసుకుంటే తీసుకెళ్లి మళ్లీ ఇంటి వద్ద దించుతాయి. వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక వాహనాలున్నాయి