బర్రెలక్క మేనిఫెస్టో ఇదే..!

23 November 2023

తెలంగాణ రాష్ట్రంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి బరిలోకి దిగిన బర్రెలక్క ఫేమ్ శిరీష.

కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ మేనిఫెస్టోను ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క.

నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా.. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తానంటున్న బర్రెలక్క.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తానన్న బర్రెలక్క ఫేమ్ శిరీష.

ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి వచ్చేలా చేస్తానని మేనిఫెస్టోలో తన తెలిపిన బర్రెలక్క ఫేమ్ శిరీష.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు మొడులుపెడతామని మేనిఫెస్టోలో తెలిపిన శిరీష.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చేలా చేస్తానన్న శిరీష.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో యువతకు ఉన్నత చదువులకు ప్రత్యేక కోర్సులు - నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్.