టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో కిషన్‌రెడ్డి

23 November 2023

మూడు సార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా. నాకిది కావాలని పార్టీని ఎప్పుడూ అడగలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే అది తీసుకున్నాను.

జాతీయ పార్టీగా బీజేపీ విధి విధానాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌లా మాది కుటుంబ పార్టీ కాదు. తెలంగాణను ప్రైవేట్‌ లిమిటెడ్‌లా బీఆర్‌ఎస్‌ మార్చేసింది.

తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్‌, కరెప్షన్‌పై ప్రజల్లో ఆగ్రహం ఉంది. భారత దేశం ప్రధానిగా నరేంద్ర మోదీ వచ్చాక, మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో దూసుకుపోతుంది.

జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలంతా బీజేపీతోనే ఉన్నారు.

గతంలో కశ్మీర్‌ యువత భారత వ్యతిరేక నినాదాలు చేసింది. ఇప్పుడు కశ్మీర్‌ యువత చేతుల్లో కంప్యూటర్లు వచ్చాయి.

కర్నాటకలో బీజేపీ ఓటు బ్యాంకు తగ్గలేదు. జనతాపార్టీ కనుమరుగవడం వల్లే కాంగ్రెస్‌ గెలుపు - కిషన్ రెడ్డి.

తెలంగాణలోని అవినీతి రహత పాలనే మా విధానం. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలి అన్నారు కిషన్ రెడ్డి.

ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా అని ఎప్పుడూ చెప్పలేదు. బీసీని ముఖ్యమంత్రి చేయాలన్నదే పార్టీ విధానం. అందుకే పోటీలో లేను.