ఎన్నికల 'సిరా' ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

30 November 2023

పని ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా నేటి యువత టెన్షన్‌తో సతమతమవుతున్నారు. దీంతో అనేక రోగాలు వారిని చుట్టుముడుతున్నాయి

ఓటు వేశామనే గుర్తింపుకు మాత్రమేకాకుండా నకిలీ ఓట్లను అరికట్టేందుకు, ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే వేసే హక్కు ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకునేందుకు భారత ఎన్నికల సంఘం దశాబ్దాలుగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది

ఒక్కాసారి వేలికి అంటుకున్న సిరా వారం, పది రోజుల తర్వాత గానీ మాసిపోతుంది. ఎందుకింత స్ట్రాంగ్‌గా సిరాను తయారు చేశారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనే విషయాలు చాలా మందికి తెలియవు

ఓటు హక్కు వినియోగం గుర్తుగా చెరగిపోని సిరా ఉపయోగించడం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. తొలిసారి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అనేక సమస్యలను ఎదుర్కొంది

ఓటు వేసిన వారే మళ్లీ ఓటేసేందుకు వస్తున్నందున వారిని ఎలా అడ్డుకోవాలో వారికి అర్థం కాలేదు. అప్పుడే కొద్దిరోజులపాటు చెడిపోని ఇంకుతో గుర్తు పెట్టాలనే 'బ్లూ ఇంక్' ఆలోచన వచ్చింది

ఆర్ అండ్ డీ సంస్థ బ్లూ ఇంక్‌ను తయారు చేస్తుంది. దీనిని మనదేశంలో 1962 పార్లమెంటరీ ఎన్నికలలో మొదటిసారిగా ఉపయోగించారు

ఆ తర్వాత మైసూర్‌లోని పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌కు బదిలీ చేయబడింది. అప్పటి నుంచి భారతదేశంలో జరిగే అన్ని ఎన్నికలకు ఇక్కడి నుంచే సిరా తయారవుతోంది

ఈ కంపెనీ మన దేశానికి మాత్రమేకాకుండా కెనడా, కంబోడియా, మాల్దీవులు, నేపాల్, నైజీరియా, దక్షిణాఫ్రికా, టర్కీ సహా అనేక దేశాలకు ఎన్నికల అవసరాలకు ఇక్కడి నుంచే సిరా సరఫరా అవుతుంది. 

ఒక సిరా బాటిల్ ధర రూ.127. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఒక సీసాలో దాదాపు 10 మి.లీ. సిరా ఉంటుంది