సిరా గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను ఆపే ఆయుధం కూడా..

07 November 2023

ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తికి ముందుగా ఎడమ చేతి చూపుడు వేలుకి సిరా గుర్తు వేసి అనుమతి ఇస్తారు.

గోరుతో పాటు చర్మానికి కలిపి వేసిన ఈ గుర్తు చెరపడం సాధ్యం కాదు. దీంతో ఆ వ్యక్తి తిరిగి వచ్చి మరో ఓటు వేయడం సాధ్యం కాదు.

వేలికి పూసిన 15 నుంచి 20 సెకండ్లలో ఈ సిరా ఆరిపోతుంది. కొన్ని రోజులకి ఈ గుర్తు మెల్లగా చెరిగిపోతుంది.

ఎన్నికలకు వినియోగించే దీని తయారీ కోసం 10 శాతం ఇంకుతో పాటు 14 నుంచి 18 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ కలిపి చేస్తారు.

సిల్వర్‌ నైట్రేట్‌ సన్ లైట్ తగిలిన వెంటనే గుర్తులా ఏర్పడుతుంది. దీని కారణంగానే ఈ ఇంకు గుర్తు త్వరగా పోదు.

కర్ణాటక ప్రభుత్వ రంగం సంస్థ మైసూర్‌ పెయింట్స్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రయోగశాల కలిసి సంయుక్తంగా ఈ ద్రవాన్ని తయారు చేస్తున్నాయి.

1962 నుంచి భారతదేశంలో ఈ సిరాను తయారు చేస్తున్నారు. 1976 నుంచి మరో 28 దేశాలకు భరత్ ఈ సిరాను ఎగుమతి చేస్తుంది.

దొంగ ఓట్ల నిర్మూలనే లక్ష్యంగా చేసుకొని ఈ సిల్వర్‌ నైట్రేట్‌ సిరా ఎన్నికల సమయంలో ఉపయోగిస్తున్నారు ఎలక్షన్ అధికారులు.