ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ఎక్కడో తెలుసా..?

TV9 Telugu

22 April 2024

నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (NRI) ఓటర్లు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి ఫారం 6A నింపాల్సి ఉంటుంది.

ఈ ఫారమ్‌ను ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా భారత రాయబార కార్యాలయాల నుండి కూడా ఉచితంగా పొందవచ్చు.

నింపిన ఫారంని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాస్‌పోర్ట్ ఫోటోకాపీ పత్రలతో కలిపి సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి పోస్ట్ చెయ్యాలి.

ఓటరు జాబితాలో మీ పేరు కనిపించిన తర్వాత మాత్రమే ఎన్నారై ఓటు హక్కు పొందుతారు. అప్పుడు మాత్రమే ఓటుకు అనుమతి ఇస్తారు.

ఓటు వేయడానికి, ప్రవాస భారతీయులు ఎన్నారై ఓటర్లు తమ పాస్‌పోర్ట్‌తో ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవాలి.

లండన్‌లోని భారత రాయబార కార్యాలయం నివేదిక ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా విదేశాల్లో ఎన్నారైలు ఓటు వేయలేరు.

విదేశాల్లోని భారతీయ మిషన్లలో ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఆన్‌లైన్ ఓటింగ్ కోసం ఇంకా ఎలాంటి నిబంధన తీసుకురాలేదు.

అలాగే భారతదేశంలో ఎన్నారై ఓటు వేయాలంటే.. అతను ఇండియాకు తిరిగి వచ్చినట్లు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలి.

అప్పుడు ఆ వ్యక్తిని సాధారణ ఓటర్ల జాబితాలో నమోదు చేస్తారు. అప్పడు ప్రత్యక్షంగా ఓటు హక్కును తన సొంత నియోజకవర్గంలోనే వినియోగించుకోవచ్చు.

ఎన్నారై ఓటర్లకు ఓటరు కార్డులు జారీ చేయదు ఎన్నికల కమిషన్. ఎన్నారై ఓటర్లు తమ పాస్‌పోర్టును పోలింగ్ స్టేషన్‌లో చూపించి ఓటు వేయవచ్చు.