తెలంగాణ దంగల్‌లో కాంగ్రెస్‌కు రెబల్స్ వీరే..!

15 November 2023

అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు ఏకంగా బుజ్జగింపుల కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.

బుజ్జగింపుల కమిటీలో ఠాక్రేతో పాటు ఏఐసీసీ కార్యదర్శి విష్ణుదాస్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.

మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబెల్స్ గుబులు పట్టుకుంది. కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా బోధ్‌ బరిలో దిగిన నరేష్‌ జాదవ్‌ నామినేషన్ రిజెక్ట్.

నర్సాపూర్‌ నియోజకవర్గంలో నామినేషన్ వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్.

సూర్యాపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి పోటీ ఇస్తున్నారు రెబల్ అభ్యర్థి పటేల్‌ రమేశ్ రెడ్డి. వరంగల్‌ వెస్ట్‌ నియోజకవర్గంలో బరిలోకి దిగిన జంగా రాఘవరెడ్డి.

ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డికి పోటీగా నామినేషన్ దాఖలు చేసిన రెబెల్ అభ్యర్థి దండెం రాంరెడ్డి.

ఆదిలాబాద్‌ నియోజగవర్గంలో సంజీవరెడ్డి, డోర్నకల్‌లో నెహ్రు నాయక్ తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన నేతలు.

పాలకుర్తిలో లక్ష్మణ్ నాయక్, సుధాకర్ గౌడ్, జుక్కల్‌లో సౌదాగర్ గంగారాం, బాన్సువాడలో కాసుల బాలరాజు, సిరిసిల్లలో అభ్యర్థులకు టెన్షన్‌ పుట్టిస్తున్న తిరుగుబాటు అభ్యర్థి ఉమేష్‌ రావు.