బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్‌.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా? 

24 november 2023

నాగర్‌ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలుచుంది కర్నె శిరీష. ఇప్పుడీమో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

బర్రెలను కాచుకుంటూ సోషల్‌ మీడియాలో బర్రెలక్క పేరుతో తెగ పాపులర్ అయ్యింది శిరీష. డిగ్రీలు చదివినా ఉద్యోగం రావట్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక తాజాగా బర్రెలక్క తమ్ముడిపై కొందరు దాడి చేసిన నేపథ్యంలో బర్రెలక్క మరింత పాపులర్‌ అయ్యింది. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా సైతం ఆమెను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇంతకీ బర్రెలక్కకు ఎంత ఆస్తి ఉంది.? ఆమెపై ఏమైనా కేసులు ఉన్నాయా.? లాంటి వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

అఫిడవిట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. బర్రెలక్క చేతిలో రూ. 5000 నగదు ఉండగా, అకౌంట్‌లో రూ. 1500 ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

బీకాం పూర్తి చేసిన శిరీష.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి తనపై ఒక కేసు (ఐపీసీ 505 (2)) ఉన్నట్లు ప్రస్తావించారు.  

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 5.73 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 1.07 లక్షలమంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 1.59 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఉన్నారు.

నగదు మినహా, తనకు ఆస్తులు, వాహనాలు ఏమీ లేవని, అప్పులు కూడా లేవని రాశారు. ఇక తాను గెలిస్తే.. ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు పోరాటం చేస్తానని చెబుతున్నారు.