ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటులు వీరే!

TV9 Telugu

22 April 2024

సామాజిక సేవ చేసే క్రమంలోనే చాలా మంది నటు వివిధ రాజకీయ పార్టీల్లో చేరుతున్నారు. ఏకంగా పార్టీలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఈసారి 2024 లోక్‌సభ ఎన్నికల్లో చాలా మంది సినీ, టీవీ నటుల పోటీ చేస్తున్నారు. టీవీ రామ్‌ నుంచి బాలీవుడ్‌ క్వీన్‌ వరకు అందరూ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు.

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో సినీ ప్రపంచం నుంచి పార్లమెంటుకు బాటలు వేయగల నటీనటులు ఎవరో తెలుసుకుందాం రండి.

రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ 2024 లోక్ సభ ఎన్నికలకు మీరట్ నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన సీటు మండిలో బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమాదిత్య సింగ్ మధ్య పోటీ నెలకొంది.

అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా వచ్చిన అవకాశన్నీ తిరస్కరించి కరకట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు పవన్ సింగ్‌.

2014, 2019లో రెండుసార్లు ఈశాన్య ఢిల్లీ స్థానంలో ఘన విజయాన్ని మనోజ్ తివారీని మరోసారి ఎన్నికల బరిలోకి దింపింది బీజేపీ.

భోజ్‌పురి సూపర్ స్టార్ రవి కిషన్ 2019లో గోరఖ్‌పూర్ నుంచి గెలిచి ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి కూడా బీజేపీ ఆయనను ఎన్నికల రంగంలోకి దింపింది.