ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ గురించి కొన్ని విషయాలు..
07 November 2023
అసెంబ్లీ ఎలక్షన్స్ మొదటి ఘట్టం అయిన నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు.
ఈ పత్రాల్లో ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే అభ్యర్థులు అందరూ నామినేషన్ పత్రాలు విషయంలో జాగ్రత్తగా ఉంటారు.
అభ్యర్థులు నామినేషన్ పత్రాలు వారి ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుంచి పొందాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఫారం-2లో వారి నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు వారి అఫిడవిట్‌ను పొందుపరచాలి.
నామినేషన్ చేసినప్పుడు అభ్యర్థికి సంబంధించి నలుగురిని మాత్రమే కార్యాలయంలోనికి అధికారులు అనుమతిస్తారు.
జాతీయ, రాష్ట్ర పార్టీ తరఫు అభ్యర్థి అయితే ఒకరు, స్వతంత్ర అభ్యర్థి కనీసం పదిమంది ప్రతిపాదించాల్సి ఉంటుంది.
ఈ నామినేషన్ పత్రాలతో పాటు తమ ఆస్తులు, అప్పులు, బ్యాంకు డిపాజిట్లు, నగదు వివరాలను అభ్యర్థులు తెలియజేయాల్సి ఉంటుంది.
అంతే కాదు అభ్యర్థిపై ఉన్న పోలీస్ కేసులు, నేర చరిత్ర విషయాలను కూడా వీటితో పాటు తెలియజేయాల్సి ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి