ఉదయం లేవగానే పడిగడుపున ఎట్టి పరిస్థితుల్లో సిట్రస్ జాతి పండ్లను తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో ఇవి తింటే కడుపు సమస్యలు, గుండెలో మంట కలిగిస్తాయి
ఇక ఉదయం టిఫిన్‌గా స్పైసీ ఫుడ్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. కడుపులో సమస్యలకు దారి తీస్తుంది.
ఉదయం లేవగానే చాక్లెట్లను తీసుకోకూడదని చెబుతున్నారు. చక్కెర కంటెంట్ ఇన్సులిన్ స్థాయిలను వెంటనే పెరిగేలా చేస్తుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ, తాగడం అలవాటు ఉంటుంది. అయితే పరగడుపు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ, టీ వంటి వాటిని తీసుకోకూడదని చెబుతున్నారు.
ఇక ఉదయం లేవగానే ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్, సోడా వంటి వాటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపులో సమస్యలు తలెత్తుతాయి హెచ్చరిస్తున్నారు.
అరటి పండులో ఉండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. అయితే ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
కాగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయం లేవగానే పుచ్చకాయ, నట్స్, ఓట్స్‌తో వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.