బాదం పప్పుతో ఫేషియల్ లాంటి అందం..! ఇలా చేస్తే మీ సొంతం..
20 January 2024
TV9 Telugu
బాదంలో ఉండే విటమిన్ ఈ మన అందాన్ని కూడా పెంచుతుంది. సహజంగా మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మరి దానిని ముఖానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
బాదం పప్పును మనం రోజూ ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. రోజూ ఈ బాదం తింటే.. శరీరానికి విటమిన్ ఈ అందడంతో పాటు.. జుట్టు రాలే సమస్య ఉండదు.
బాదం పప్పుతో మనం ఓ ఫేషియల్ ని ఇంట్లో నే తయారు చేసుకోవచ్చు. దాని కోసం మనకు రెండు టేబుల్ స్పూన్ల చందనం, ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్, టీ స్పూన్ తేనె, కొంచెం పాలు సరిపోతాయి.
ఇప్పుడు పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసి మెత్తని పేస్టులాగా తయారయ్యే వరకు బాగా కలుపుకోవాలి. చాలా మెత్తగా స్మూత్‌గా అయ్యే వరకు పేస్టులాగా చేసుకోవాలి.
ఇప్పుడు ముఖాన్ని మంచిగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత.. మనం తయారు చేసుకున్న క్రీమ్ ని ముఖానికి, అలాగే మెడ ప్రాంతంలో పూర్తిగా అప్లై చేయాలి.
ఇప్పుడు దానిని ముఖానికి రాసిన తర్వాత నెమ్మదిగా, సున్నితంగా మసాజ్ చేయాలి. ఫేస్ కి మంచిగా మసాజ్ చేసిన తర్వత.. కాసేపు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ముఖం కడిగిన తర్వాత.. తేలికపాటి మాయిశ్చరైజర్ ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. కాగా.. దీనిని పలుమార్లు చేయడం వల్ల.. చర్మం చాలా మెరుస్తుంది.
ఈ హోమ్ మేడ్ ఫేషియల్‌తో ముఖంపైన ఉన్న డెడ్ స్కిన్ పోతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. బాదంలో ఉండే విటమిన్ ఈ స్కిన్ కి గ్లో ఇస్తుంది. అంతేకాదు..యాంటీ ఏజినింగ్‌గా కూడా పని చేస్తుంది.