16 May 2024
TV9 Telugu
Pic credit - Pexels
తెల్లగా మంచు ముద్దలా మెరిసిపోవటమే కాదు చిత్ర విచిత్రమైన లక్షణాలు అస్థిపంజరం పువ్వు సొంతం. పేరే కాదు దీని లక్షణాలు కూడా వెరీ వెరీ స్పెషల్.
అస్థిపంజరం పువ్వుకు చిత్రమైన లక్షణం ఉంది. అందమైన పుకు నీరు తగిలితే చాలు.. తెల్లగా ఉండే ఈ పూలు పారదర్శకంగా మారిపోతాయి.
జపాన్‌లో పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పువ్వులు వర్షకాలంలో గాజుపూలను తలపిస్తూ అందంగా కనిపిస్తూ పర్యాటకులకు విపరీతంగా ఆకట్టుకుంటాయి.
ఇలా నీరు తగిలితే పారదర్శకంగా ఎందుకు మారిపోతున్నాయని సైంటిస్టులు పరిశోధించారు. ఈ పూల రేకుల కణ నిర్మాణం వల్లనే పారదర్శకంగా మారిపోతున్నాయని గుర్తించారు.
అస్థిపంజరం పుష్పం ప్రధానంగా తేమతో కూడిన, చెట్లతో కూడిన పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది. తక్కువ సూర్యకాంతి లేదా నీడ ఉన్న ప్రదేశాలలో బాగా పెరుగుతుంది.
పొడి వాతావరణంలో ఈ పూల రేకుల్లోని ఎయిర్ లిక్విడ్ ఇంటర్‌ఫేస్ రిఫ్లెక్ట్స్ తో తెల్లగా కనిపిస్తాయి. నీరు తగలగానే అవి వాటర్ ఇంటర్‌ఫేస్ ప్రక్రియ వల్ల పారదర్శకంగా మారిపోతాయి.
దీని అసాధారణమైన స్వభావంతో స్కెలిటన్ పూలు అటు ప్రకృతి ప్రేమికులను, ఇటు పరిశోధకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.