మానవ అక్రమ రవాణా కేసులు.. టాప్‌లో తెలంగాణ!

11 December 2023

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాల ప్రకారం అత్యధిక మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది.

తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాలు యాక్టివ్‌గా ఉండటంతో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఉద్యోగం, ఉపాధి, ప్రేమ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తెలంగాణకు రప్పిస్తున్నారు. చివరకు వ్యభిచార కూపాల్లో దించుతున్నారు.

భారతదేశంలో బీహార్, యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాలకార్మికుల అక్రమ రవాణా సాగుతోందని తెలుస్తోంది.

కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారం సీఐడీ పోలీసులు, స్వచ్చంధ సంస్థలు, చైల్డ్ ప్రొటెక్షన్, లోకల్ పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరుతో దాడులు నిర్వహిస్తున్నారు.

గతేడాది దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు అయ్యాయి. కాగా 391 కేసులు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వెలుగు చూశాయి.

ఈ కేసుల్లో 25 మంది బాలికలు, 9 మంది మంది బంగ్లాదేశ్ యువతులు, 641 మంది మహిళలు, 38 మంది బాలురుతో సహా మొత్తం 704 మందిని రాష్ట్ర పోలీసులు కాపాడారు.

బాధితుల్లో కొందరిని రెస్క్యూ హోమ్స్‌కు బాలకార్మికులను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మరికొందరిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు.