పొరపాటున కూడా ATM దగ్గర ఈ తప్పు చేయకండి..
TV9 Telugu
08 April 2024
ప్రతిరోజూ స్కామర్లు రకరకాల ట్రిక్స్ ఫ్లే చేస్తూ, ప్రజలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు.
ప్రస్తుతం ఏటీఎం మెషిన్‌కు సంబంధించి భారీ మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
సైబర్ మోసగాళ్లు తమ నంబర్‌ను ఏటీఎం దగ్గర రాసుకుని, కస్టమర్ కేర్‌గా నటిస్తూ వినియోగదారులతో మాట్లాడుతున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. ఏటీఎం వద్ద కనిపించే కస్టమర్ కేర్ నెంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ పోలీసులు.
ఇటీవల ఢిల్లీలో ఓ మహిళ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లగా.. ఆమె కార్డు మెషీన్‌లో ఇరుక్కుపోయింది.
కార్డు చిక్కుకుపోవడంతో మహిళ ఏటీఎం దగ్గర హెల్ప్‌లైన్ నంబర్‌ను చూసింది. ఆ నంబర్‌కు కాల్ చేయగా, ఆమె మోసపోయింది.
స్కామర్లు మహిళ నుండి మొత్తం 21 వేల రూపాయలను దోచుకున్నారు, దాని గురించి మహిళ సోషల్ మీడియా వేదిక X ద్వారా వెల్లడించింది.
సో బీ కేర్ ఫుల్ ఎటీఎం వద్ద కనిపించే అన్ని నెంబర్లు అసలైన కస్టమర్ కేర్‌కు సంబంధించినవి కావని గుర్తించండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి