TV9 Telugu
31 January 2024
ప్రస్తుతం విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో సందడి చేస్తున్నాడు. దీంతో ఢిల్లీ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడుతున్నారు. ఇక నేడు కోహ్లీ బ్యాటింగ్‌కు రానుండడంతో అందరి చూపు ఆయనపైనే నిలిచింది.
విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో సుమారు 4 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017 లో వివాహం చేసుకున్నాడు. కానీ మీడియా కథనాల ప్రకారం, కోహ్లీకి అంతకు ముందు కూడా ఒక స్నేహితురాలు ఉంది.
అనుష్క శర్మ కంటే ముందు, బ్రెజిల్ మోడల్, నటి ఇసాబెల్లె లైట్ విరాట్ కోహ్లీకి స్నేహితురాలు. ఈ విషయాన్ని ఇసాబెల్ స్వయంగా వెల్లడించింది. అయితే, ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ ఎప్పుడూ ప్రస్తావించలేదు.
ఇసాబెల్ 2014లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేమిద్దరం సుమారు 2 సంవత్సరాలు డేటింగ్ చేశామని చెప్పుకొచ్చింది. అయితే, ఈ సమయంలో వారు తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచారంట. కానీ, ఇద్దరూ చాలా చోట్ల కలిసి కనిపించారు. ఆ తర్వాత డేటింగ్ వార్తలు వెలుగులోకి వచ్చాయి.
సింగపూర్‌లో జరిగిన ఓ కమర్షియల్ షూటింగ్‌లో ఇసాబెల్, విరాట్ కలుసుకున్నారు. మీడియా కథనాల ప్రకారం, వారిద్దరూ చాలా త్వరగా స్నేహితులయ్యారు. ఆ తరువాత సంబంధంలోకి వచ్చారు.
విరాట్‌తో విడిపోవడానికి ఇసాబెల్ నిర్దిష్ట కారణం చెప్పలేదు. అయితే, ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉందని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ, సంబంధం పెద్దగా ముందుకు సాగలేదు. పరస్పర అంగీకారంతో విడిపోయారంట. విడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు.
ఇసాబెల్లె 2012లో అమీర్ ఖాన్ చిత్రం తలాష్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.
ఇసాబెల్ ప్రస్తుతం వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.