17th OCT 2023
Pic credit - Instagram
భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అక్టోబర్ 19 గురువారం పూణెలోని MCA స్టేడియంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా గొప్ప రికార్డును టీమిండియా స్ట్రాంగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టనున్నాడు.
అక్టోబరు 19న బంగ్లాదేశ్‌తో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 40 పరుగులు చేస్తే.. తన పేరిట ఓ గొప్ప రికార్డు సృష్టించినట్టే.
బంగ్లాదేశ్‌పై 40 పరుగులు చేస్తే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిగా నాలుగో స్థానానికి చేరుకుంటాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో తన మొత్తం 1226 పరుగులను పూర్తి చేస్తాడు. దీంతో లారాను వదిలి నాల్గవ స్థానానికి చేరుకుంటాడు.
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 2278 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ 2, కుమార సంగక్కర 3వ స్థానంలో ఉన్నాడు.
19న టీమిండియా తదుపరి మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.