బ్యాటింగ్ చేయకున్నా.. కోహ్లీ ఖాతాలో చేరిన స్పెషల్ రికార్డ్
29 JULY 2023
Pic credit - Twitter
తొలి వన్డేలో సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
వన్డేలో ప్లేయింగ్ 11లో ఉండి.. బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం బహుశా మొదటిసారి కావొచ్చు.
అయినా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ రికార్డును సమం చేయగలిగాడు.
18వ ఓవర్ నాలుగో బంతికి వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ క్యాచ్ పట్టిన విరాట్ రికార్డు సృష్టించాడు.
కోహ్లీ వన్డే ఫార్మాట్లో 142 క్యాచ్‌లు అందుకున్నాడు.
వన్డే ఫార్మాట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రాస్ టేలర్‌తో కలిసి 4వ స్థానంలో నిలిచాడు.
కోహ్లి 275 మ్యాచ్‌లలో 273 ఇన్నింగ్స్‌లలో 142 క్యాచ్‌లు పట్టాడు.
కివీస్ బ్యాట్స్‌మెన్ టేలర్ మొత్తం 236 మ్యాచ్‌ల్లో 142 క్యాచ్‌లు పట్టగలిగాడు.
లంక దిగ్గజం మహేల జయవర్ధనే 448 మ్యాచ్‌ల్లో 218 క్యాచ్‌లతో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 375 మ్యాచ్‌ల్లో 160 క్యాచ్‌లు అందుకున్నాడు.
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 334 మ్యాచ్‌ల్లో 156 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక్కడ క్లిక్ చేయండి