ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నిరాశపరిచారు. మరోసారి తమ బలహీనతలతో వికెట్లు జారవిడుచుకున్నారు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
శ్రీలంకలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ 11 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ ఇద్దరు లెజెండ్స్‌ను లెఫ్టార్మ్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ఔట్ చేయడం విశేషం.అంటే 2021 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను షాహీన్ అఫ్రిది ఔట్ చేశాడు.
ఇప్పుడు మళ్లీ భారత జట్టు బ్యాటింగ్ వెన్నెముకను బద్దలు కొట్టడంలో పాక్ పేసర్ సక్సెస్ అయ్యాడు.లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికీ విఫలమవుతున్నారు.
ఎందుకంటే గత రెండేళ్లుగా ఎడమచేతి వాటం బౌలర్ల ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు.
2021 నుంచి వన్డే క్రికెట్‌లో లెఫ్టార్మ్ పేసర్ల నుంచి విరాట్ కోహ్లీ మొత్తం 98 బంతులు ఎదుర్కొని, 87 పరుగులు మాత్రమే చేశాడు. అంటే కోహ్లీ ఎడమచేతి వాటం పేసర్లపై 21.75 సగటుతో మాత్రమే పరుగులు చేయగలుగుతున్నాడు.
ఎడమచేతి వాటం పేసర్లకు అతను 4 సార్లు వికెట్లు సమర్పించుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల ముందు కోహ్లీ గత రెండేళ్లుగా పరుగులు చేయడంలో వెనుకబడ్డాడని స్పష్టమవుతోంది.
2021 నుంచి రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో లెఫ్టార్మ్ పేసర్ల నుంచి మొత్తం 147 బంతులు ఎదుర్కొన్నాడు. 138 పరుగులు మాత్రమే చేశాడు. అంటే 23 సగటుతో మాత్రమే పరుగులు చేసి, 6 సార్లు ఔట్ అయ్యాడు.
అంటే రోహిత్ శర్మ ఎడమచేతి వాటం పేసర్లకు సులభంగా వికెట్లు అందజేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిది హిట్‌మ్యాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.