7 సిక్సులు, 15 ఫోర్లతో 173 పరుగులు.. టీ20 సిరీస్‌లో తిలక్ దూకుడు..

Pic credit - Instagram

14 August 2023

తిలక్ అరంగేట్రంలోనే తనదైన ముద్ర వేశాడు. చాలా మంది బ్యాట్స్‌మెన్ భారత్‌కు అరంగేట్రం చేశారు. కానీ, తిలక్ వర్మ లాంటి ముద్ర వేసేవారు చాలా తక్కువ. 

అరంగేట్రంలో సూపర్ హిట్..

అంతర్జాతీయ క్రికెట్‌లో తిలక్ వర్మ అడుగుజాడలు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి మొదలయ్యాయి. తన అరంగేట్రం సిరీస్‌లోనే జట్టు వెతుకుతున్న ప్రతిభ తనదేనని నిరూపించాడు.

ఆ స్థానంపై కన్ను..

5 టీ20ల సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో తిలక్ కూడా ఉన్నాడు. 5 ఇన్నింగ్స్‌లలో 57.66 సగటు, 140.65 స్ట్రైక్ రేట్‌తో 173 పరుగులు చేశాడు. 

అత్యధిక పరుగుల లిస్టులో తిలక్..

5 టీ20ల సిరీస్‌లో హైదరాబాదీ ప్లేయర్ 15 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో బౌలర్లను చిత్తు చేశాడు. అటు ఫీల్డింగ్‌లోనూ తనదైన శైలిలో ముద్ర వేశాడు.

15 ఫోర్లు, 7 సిక్సులు..

తిలక్ తన అరంగేట్రం టీ20 సిరీస్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన తర్వాత భారత జట్టు మిడిల్ ఆర్డర్‌లో మెరుగైన ఎంపికగా నిలిచాడు.

మిడిల్ ఆర్డర్‌లో బెస్ట్ ఛాన్స్..

మిడిల్ ఆర్డర్‌లో ముఖ్యంగా 4వ స్థానంలో టీమ్ ఇండియాకు తిలక్ వర్మ అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఎందుకంటే అతను బలమైన ప్రదర్శనతో పాటు, ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌గానూ ముద్ర వేశాడు.

4వ స్థానంలో..

మొదటి అంతర్జాతీయ సిరీస్ ఆడిన తిలక్.. ఆటలో చూపిన పోరాట పటిమ అద్భుతంగా ఉంది. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశాడు.

తొలి అంతర్జాతీయ సిరీస్..

వెస్టిండీస్‌ ప్రదర్శనతో ఇకపై రాబోయే సిరీస్‌ల్లోనూ తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాటర్‌ కావడంతో టీమిండియాకు కలిసిరానుంది.

రాబోయే సిరీస్‌ల్లో ఛాన్సులు..