18 August 2023

వన్డే వరల్డ్‌కప్‌కు ఈ భారత ప్లేయర్స్ ఇన్..

విరాట్ కోహ్లీ: ఈ వెటరన్ ప్లేయర్, టీమిండియాకు మిడిల్ ఆర్డర్‌లో మూల స్తంభం లెక్క. క్రీజులో నిలదొక్కుకుంటే.. ప్రత్యర్ధులకు హడలే. 

శుభ్‌మాన్ గిల్: ఈ యంగ్ ప్లేయర్‌కు వన్డేల్లో రికార్డులు ఎక్కువే. రెండంకెల స్కోర్‌ను మూడుగా కన్వర్ట్ చేస్తే.. జట్టు స్కోర్ భారీగానే నమోదవుతుంది. 

రోహిత్ శర్మ: కెప్టెన్ రోహిత్.. అటు ఓపెనర్‌గా, ఇటు సారధిగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ అదే ఆటతీరు కొనసాగే ఛాన్స్ ఉంది.

శ్రేయాస్ అయ్యర్: గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్.. ప్రపంచకప్ జట్టులో మిడిల్ ఆర్డర్‌కు చాలా కీలకం. నిలదొక్కుకుంటే.. ప్రత్యర్ధులకు ఇబ్బందే. 

సూర్యకుమార్ యాదవ్: ఈ టీ20 స్పెషలిస్ట్.. వన్డేల్లో భారీ స్కోర్ ఇంకా చేయాల్సి ఉంది. చూడాలి. రాబోయే రోజుల్లో ఎలా ఆకట్టుకుంటాడో.. 

హార్దిక్ పాండ్యా: ఈ ఆల్‌రౌండర్, బ్యాట్స్‌మెన్.. అటు బ్యాటర్‌గా.. ఇటు బౌలర్‌గా జట్టుకు కీలకం. పాండ్యా గట్టి పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది.

రవీంద్ర జడేజా: అశ్విన్ స్థానంలో.. జడేజా జట్టుకు ఎంతో కీలకం. ఫినిషర్‌గానే కాదు.. స్పిన్నర్‌గానూ.. జడేజా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. 

మహమ్మద్ షమీ: బౌలింగ్ విభాగాన్ని బుమ్రాతో పాటు షమీ కూడా సారధ్యం వహించనున్నాడు. షమీ చక్కటి పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది.