30 August 2023

ఆసియా కప్‌ను ఎక్కువసార్లు గెలిచిన జట్టు ఇదే ??

భారత్: అత్యధికంగా 7 సార్లు టీమిండియా జట్టు ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఇందులో ఆరుసార్లు వన్డే ఫార్మాట్, ఒకసారి టీ20 ఫార్మాట్‌లో కప్‌ను భారత్ గెలిచింది.

శ్రీలంక: ఆసియా కప్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న జట్ల జాబితాలో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఆరుసార్లు ఆసియా కప్ గెలుచుకుంది

పాకిస్థాన్: పాక్ జట్టు ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే ఆసియా కప్‌ను గెలుచుకుంది. 

మూడు జట్లు మాత్రమే: 1984 నుంచి 2022 వరకు భారత్, శ్రీలంక, పాకిస్థాన్ మాత్రమే ఆసియా కప్‌ను గెలుచుకున్నాయి. ఆసియాలోని మిగిలిన జట్లకు ఈ కప్ అందని ద్రాక్షగానే ఉంది. 

డిఫెండింగ్ ఛాంపియన్: వన్డే ఫార్మాట్‌లో చివరగా 2018లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించగా.. దీన్ని గెలిచిన భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. 

2022లో: 2022లో టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలుచుకుంది. 

ఏ గ్రూప్‌లో ఏ జట్టు?: ఈసారి ఆరు జట్లు ఆసియా కప్‌లో తలపడనుండగా.. గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్ Bలో ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. 

సెప్టెంబర్ 17న ఫైనల్: ఆగస్టు 30 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబో వేదికగా జరగనుంది. టోర్నీలో భాగంగా మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.