13 August 2023
భారత క్రికెట్ జట్టులోని చాలా మంది విద్యార్హతలు మనకు తెలియదు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. భారత్ జట్టులో ఇంజనీరింగ్ చదివిన వారు కూడా ఉన్నారు.
ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టులో ఇంజనీరింగ్ పట్టలాలను కలిగి ఉన్న ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 1991-92 మధ్య కాలంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం కూడా చేశాడు. అశ్విన్‌కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ డిగ్రీ ఉంది.
క్రికెట్ లెజెండ్ ఎరపల్లి అనంతరావు శ్రీనివాస్ ప్రసాద్ మైసుర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు.
మాజీ క్రికెటర్ శ్రీనాథ్ కూడా ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నాడు. మైసురులోని ఎస్‌జేసీ ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీనాథ్ చదివాడు.
భారత జట్టులోని మాజీ క్రికెటర్, ఐసీసీ రిఫరీ శ్రీనివాస రాఘవన్ వెంకట రాఘవన్ చెన్నైలోని అనుభవం కలిగిన ఇంజనీర్.
1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో ఒకరైన కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నాడు.