09 August 2023
టీ20 క్రికెట్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్‌కు సాటి ఎవరూ రారని అతని ప్రపంచ రికార్డులే రుజువుచేస్తుంటాయి.
సూర్యకుమార్ యాదవ్ టీ20 ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 29 నెలల్లో 51 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో భారత్ 37 మ్యాచ్‌లు గెలిచింది. ఆ 37 మ్యాచ్‌లలో 12 మ్యాచ్‌లలో SKY ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
దీంతో అతి తక్కువ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచ రికార్డు సూర్య పేరిట చేరింది.
ఇంతకుముందు ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ నబీ పేరిట ఉంది. అతను 70 మ్యాచ్‌లు ఆడి 12 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ప్రస్తుతం నబీకి 109 మ్యాచ్‌ల్లో 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు దక్కాయి.
విరాట్ కోహ్లీ 73 మ్యాచ్‌ల్లో 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు గెలిచాడు. రోహిత్ శర్మ 138 మ్యాచ్‌ల తర్వాత ఇక్కడకు చేరుకున్నాడు.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధికంగా 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లి 115 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
T20 అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత అత్యధికంగా 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన భారతీయుడు సూర్యకుమార్. ఆ తర్వాత విరాట్, భువీ తలో 3 సార్లు గెలిచారు.
సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 83 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌తో పునరాగమనం చేశాడు. దీంతో రాబోయే టోర్నీల్లో అవకాశాల కోసం ముందంజలో నిలిచాడు.