03 August 2023

Pic credit - Instagram

కోహ్లీని అధిగమించిన గిల్.. ఆ లిస్టులో అగ్రస్థానం..

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు బాదాడు. 

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. 

భారత్ గెలిచిన వన్డేల్లో శుభ్‌మన్ గిల్ అత్యధిక సగటు సాధించాడు. ఈ విషయంలో సహచర ఆటగాడు విరాట్ కోహ్లీ కంటే శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. 

భారత్ తరపున గెలిచిన వన్డేల్లో శుభ్‌మన్ గిల్ 77.87 సగటుతో పరుగులు చేశాడు.

ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ తర్వాత విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ సగటు 73.70లుగా నిలిచింది. 

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ 68.60 సగటుతో పరుగులు చేశాడు. 

ఆ తర్వాత అంబటి రాయుడు 67.47 సగటుతో పరుగులు చేశాడు.

ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ 59.27 సగటుతో పరుగులు చేశాడు. 

సచిన్ టెండూల్కర్ 56.63 సగటుతో పరుగులు సాధించాడు. 

ఇక భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు జాబితాలో చివరి స్థానంలో ఉంది. గంగూలీ 54.98 సగటుతో పరుగులు సాధించాడు.