వరుస సెంచరీలతో ఫ్రాంచైజీలకు నిద్రలేకుండా చేస్తోన్న శ్రేయాస్ అయ్యర్

TV9 Telugu

6 November 2024

రంజీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. దీంతో పాటు రంజీ ట్రోఫీలో అతను చేసిన సెంచరీ ఇన్నింగ్స్ ఐపీఎల్ మెగా వేలంలో అతని విలువను పెంచనుంది. 

అందుకే బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు అయ్యర్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో కూడా అయ్యర్ కు చోటు దక్కలేదు.

ఈలోగా విడుదల చేసిన ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ పేరు లేదు. గత సీజన్లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించిన అయ్యర్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. 

ఈలోగా విడుదల చేసిన ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ పేరు లేదు. గత సీజన్లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించిన అయ్యర్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. 

అయితే అయ్యర్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో వేలంలో భారీ మొత్తాన్ని రాబట్టే సూచనలు చేశాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్నాడు. 

శ్రేయాస్ అయ్యర్ ఈ టోర్నీలో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. తానెలాంటి ఆటగాడో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ నాలుగో రౌండ్లో ఒడిశాపై అయ్యర్ అద్భుత సెంచరీ సాధించాడు. 

2024-25 రంజీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. అయ్యర్ కేవలం 101 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఇది 15వ సెంచరీ. 

గాయం కారణంగా త్రిపురతో జరిగిన మ్యాచ్ లో అయ్యర్ ఆడలేకపోయాడు.  అంతకుముందు మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 190 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 142 పరుగులు చేశాడు. 

రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలతో ఫామ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు భారత జట్టులో పునరాగమనంపై కన్నేశాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. శ్రేయాస్ అయ్యర్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. 

అయ్యర్ స్వయంగా వేలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నందున అతన్ని జట్టు నుంచి విడుదల చేయాల్సి వచ్చిందని జట్టు సీఈఓ వెంకీ మైసూర్ స్పష్టం చేశారు. దీంతో అయ్యర్ వచ్చే ఎడిషన్‌లో మరో జట్టుకు ఆడనున్నాడు.