భారత జట్టులో అత్యంత డేంజరస్ ఓపెనర్లు వీరే.. లిస్ట్‌ చూస్తే షాకే

Venkata Chari

13 Jul 2025

భారత జట్టులో ఎంతోమంది డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. ఈ లిస్ట్‌లో మొత్తం ఇద్దరు ప్లేయర్లు తమ సత్తా చాటారు. వీరు పరుగుల వర్షం కురిపించారు.

అలాగే, ఈ లిస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు నుంచి ఒకరు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు ప్లేయర్లు, భారత జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు.

టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉంది. అతను 278 ఇన్నింగ్స్‌లలో ఓపెనింగ్‌గా 11845 పరుగులు చేశాడు.

2వ స్థానంలో భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ ఉన్నాడు. గవాస్కర్ ఓపెనర్‌గా 203 ఇన్నింగ్స్‌లలో 9607 పరుగులు చేశాడు.

మూడవ పేరు ఆస్ట్రేలియా మాజీ తుఫాన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ 8747 పరుగులు చేశాడు.

నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఉన్నాడు. అతన్ని వార్నర్ అధిగమించాడు. ఓపెనర్‌గా హేడెన్ 50.74 సగటుతో 8625 పరుగులు చేశాడు.

గవాస్కర్ తర్వాత, ఈ జాబితాలో పేరున్న రెండవ భారతీయ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు 50.04 సగటుతో 8207 పరుగులు చేశాడు.

టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు వింటనే బౌలర్లు ఎంతో భయపడేవారు. ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల వర్షం కురిపించేవాడు.