13 August 2023
Pic credit - Instagram
ఈసారి ఆసియా కప్‌లో 8వ సారి ఛాంపియన్‌గా నిలవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయానికి చేరుకున్నారు.
రోహిత్ తన కుటుంబంతో సహా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు చేశారు.
ఆసియా కప్ ఆడేందుకు రోహిత్ నాయకత్వంలో టీమిండియా శ్రీలంక వెళ్లాల్సి ఉంది. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ తిరుమల ఆలయానికి వెళ్లి జట్టు విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో భారత్ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
ఆసియా కప్‌నకు సంబంధించి భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ఎంపిక కాగానే ఆటగాళ్లకు క్యాంపు నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే జట్టును ఎంపిక చేసిన తర్వాత మైదానంలో సన్నాహకాలు ఉంటాయి. కానీ, రోహిత్ మాత్రం తిరుమల ఆలయాన్ని సందర్శించి దానికి శ్రీకారం చుట్టాడు.
ఇప్పటి వరకు టీమిండియా 7సార్లు విజేతగా నిలిచి, ఆసియాకప్‌లో అగ్రస్థానంలో నిలిచింది, ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి.