6 August 2023

రోహిత్ శర్మ సహా ఈ ఏడుగురికి ఇదే చివరి వరల్డ్‌కప్..!

2015, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆడిన రోహిత్ శర్మ 2023 మెగా టోర్నీ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం ఉంది. 

ఇప్పటికే రెండు వరల్డ్‌కప్‌(2015,19)ల్లో ఆడిన మిచెల్ స్టార్క్ తన ఫిట్‌నెస్, వయసు దృష్ట్యా 2023 మెగాటోర్నీ తర్వాత మరో టోర్నీ వరకు క్రికెట్‌లో కొనసాగేందుకు అవకాశం తక్కువ.

సౌతాఫ్రికా తరఫున ఇప్పటికే రెండు ప్రపంచకప్‌లు ఆడిన డేవిడ్ మిల్లర్ కూడా 2023 వరల్డ్ కప్ తర్వాత ఆటను కొనసాగించకపోవచ్చు. 

2011 వరల్డ్ కప్ నుంచి వరుస టోర్నీలు ఆడిన శ్రీలంక క్రికెటర్ అంజెలో మాథ్యూస్‌ 2023 ప్రపంచకప్ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం ఉంది. 

ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కి విడ్కోలు చెప్పిన మొయిన్ ఆలీ 2023 వరల్డ్ కప్ తర్వాత వన్డే క్రికెట్‌కి కూడా గుడ్ బై చేప్పేందుకు అవకాశం ఎక్కువ.

బ్లాక్ క్యాప్స్ తరఫున 3 ప్రపంచకప్‌లు ఆడిన టిమ్ సౌథీ ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో 2023 మెగా టోర్నీ తర్వాత మరో ప్రపంచకప్ అతను ఆడకపోవచ్చు. 

ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్నవారిలో అత్యంత అనుభవశాలి షకిబ్ అల్ హాసన్. 2006 నుంచి క్రికెట్ ఆడుతున్న షకిబ్ ఇప్పటివరకు 4 మెగా టోర్నీలు ఆడాడు. ఈ క్రమంలో 2023 వరల్డ్ కప్ అతనికి చివరిది కావచ్చు.