తక్కువ టైం లో 16 కిలోలు బరువు తగ్గిన రిషబ్ పంత్.. ఆ డైట్ ప్లాన్ మీకు కావాలా ??

Phani CH

30 November 2024

క్రికెట్ లవర్స్ కు రిషబ్‌ పంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సంచలనాలకు మారుపేరుగా నిలిచిన క్రికెటర్ గ పంత్ కు పేరు ఉంది.

అయితే రిషబ్‌ పంత్‌ గతంలో బొద్దుగా ఉంది ఊబకాయంతో బాధపడేవాడు. అయితే ప్రస్తుతం సన్నగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడట.

రిషబ్‌ పంత్‌ నాలుగు నెలల్లో 16 కిలోలు బరువు. దీని కోసం ప్రత్యేక డైట్‌ ను ఫాలో అయ్యాడట.. ఆ డైట్ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధానంగా కేలరీలు తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకున్నాడట.. దీని వల్ల శరీరం లో ఉండే అదనపు కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.

తరువాత జంక్ ఫుడ్స్ తినడం మానేసాడట.. ముఖ్యంగా బయట ఆహారానికి దూరమయ్యాడు పంత్. కేవలం ఇంటి భోజనానికి పరిమితమయ్యాడట.

పంత్ బరువు తగ్గడం కోసం ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రత్యేకగా శ్రద్ద తీసుకుని ప్రత్యేకమైన ఆహారాన్ని అందించారట.

స్వీట్స్‌లలో అత్యధిక క్యాలరీలు ఉంటాయని మిఠాయిలకు దూరంగా ఉన్నాడు. దీనితోపాటు ఫ్రై పదార్థాలు, బిర్యానీ కూడా తినలేదంట.

వేళకు నిద్రపోవడం రిషబ్‌ పంత్‌ బరువు తగ్గుదలకు ఒక కారణం. శరీరానికి సరైన నిద్ర ఉంటే బరువు నియంత్రణలో ఉంటుందనే విషయాన్ని గుర్తించండి.