IPL 2025: ఆర్‌సీబీకి బ్యాడ్ న్యూస్.. దూరమైన రూ. 2.30 కోట్ల ప్లేయర్
TV9 Telugu
10 February 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ కోసం రంగం సిద్ధమవుతోంది. ఇది వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముందే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది.
ఈ ఆర్సీబీ స్టార్ ఐపీఎల్ 2025 లో పాల్గొంటాడా లేదా అనే దానిపై ఒక ప్రశ్న తలెత్తింది. మెగా వేలంలో దాదాపు రూ. 2.30 కోట్లు ఖర్చు చేసి ఆర్‌సీబీ ఈ ఆటగాడిని తన జట్టులో చేర్చుకుంది.
కానీ, ఐపీఎల్ 2025లో అతను లేకపోవడం వల్ల జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. IPL 2025 సీజన్‌లో తొలి మ్యాచ్ మార్చి 21న జరుగనుండగా, మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
దీనికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని స్టార్ ఆటగాడి గాయం కారణంగా, అతను IPL 2025లో భాగం కావడం కష్టంగా కనిపిస్తోంది.
ఫిబ్రవరి 6న భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. దీనిలో భారత ఆటగాళ్ళు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు.
ఇంగ్లీష్ జట్టు యువ ఆటగాడు జాకబ్ బెథెల్ గాయపడ్డాడు. ఆ కారణంగా అతను గత 2 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. రెండవ మ్యాచ్‌కు ముందు అతనికి తొడ కండరాల నొప్పి వచ్చింది.
కెప్టెన్ జోస్ బట్లర్ తన పునరాగమనం గురించి ఒక అప్‌డేట్ ఇచ్చాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి బెథెల్ దూరంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.
ఈ భారీ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న తర్వాత, అతను ఈ సీజన్లో కూడా RCBకి అందుబాటులో ఉండకపోవచ్చని భావించవచ్చు.