క్రికెట్ కోసం కాలేజీకే డుమ్మా.. ధోని దెబ్బకు లైఫ్ ఛేంజ్..

03rd OCT 2023

Pic credit - Instagram

ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్ నేపాల్‌ను ఓడించింది. అరంగేట్రం ఆటగాడు సాయి కిషోర్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

సాయి కిషోర్ అరంగేట్రం

సాయి కిషోర్ తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ సహాయంతో నేపాలీ బ్యాట్స్‌మెన్‌లను ట్రాప్ చేశాడు. అతను 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

4 ఓవర్లలో

అరంగేట్రం మ్యాచ్‌లో సాయి కిషోర్ కూడా ఎమోషనల్‌గా కనిపించాడు.  జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. బంతిని అందుకున్న తర్వాత బ్యాట్స్‌మెన్‌ను చుక్కలు చూపించాడు.

అరంగేట్రం మ్యాచ్‌

టీఎన్‌పీఎల్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో సాయి కిషోర్ ఫేమస్ అయ్యాడు. ఈ ఆటగాడు మొదట ఇంజనీర్ లేదా శాస్త్రవేత్త కావాలని కోరుకున్నాడు. క్రికెటర్‌ కావాలని అనుకోలేదు.

మొదట ఇంజనీర్ లేదా శాస్త్రవేత్త

సాయి క్రికెట్ కంటే చదువుకే ప్రాధాన్యత ఇస్తూ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో 2 నెలలు కాలేజీని కూడా విడిచిపెట్టాడు. 

2 నెలలు కాలేజీకి దూరం

సాయి తన చదువును వదిలి క్రికెట్‌పై దృష్టి సారించాడు. ఆ తర్వాత అతను తమిళనాడు జట్టులో చేరాడు. అనంతరం CSK అతనికి IPLలో అవకాశం కల్పించింది. 

క్రికెట్ పైనే ఫోకస్

సాయి CSK జట్టులో ఉన్నప్పుడు, అతను నెట్స్‌లో బ్యాట్స్‌మెన్‌లందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ, ధోని పదునైన షాట్ ఆడడం ద్వారా సాయి కలలను విచ్ఛిన్నం చేశాడు.

CSK జట్టులో

ధోని చేతిలో ఓడిన తర్వాత తన బౌలింగ్‌పై ఎక్కువ పనిచేశానని సాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి ప్రదర్శనతోనే అతను నేడు టీమ్ ఇండియా తరపున ఆడుతున్నాడు.

ధోని చేతిలో