22 August 2023
Pic credit - Instagram
ఆసియా కప్ 2023 ఆడాలని కలలు కన్న ఓ టీమ్ ఇండియా ప్లేయర్‌కు బ్యాడ్ న్యూస్ అందింది. 2023 ఆసియా కప్‌కు టీమ్ ఇండియా ఎంపికైంది. సెలెక్టర్లు ఈ బ్యాట్స్‌మన్‌కు హ్యాండిచ్చారు.
సెలెక్టర్లు ఈ ఆటగాడికి ఆసియా కప్ 2023 జట్టులో స్థానం ఇవ్వలేదు. కారణం ఈ ఆటగాడి ఫామ్, ఫిట్‌నెస్. దీంతో ఈ ఆటగాడి కెరీర్ కష్టాల్లో కూరుకుపోయి జట్టు తలుపులు దాదాపుగా మూసుకుపోయాయి.
పృథ్వీ షా ఇటీవలే 2023లో ఇంగ్లండ్ వన్డే కప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున సోమర్‌సెట్‌పై 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. పృథ్వీ షా కూడా నార్తాంప్టన్‌షైర్ తరఫున డర్హామ్‌పై 76 బంతుల్లో అజేయంగా 125 పరుగులు చేశాడు.
23 ఏళ్ల పృథ్వీ షా 2023 వన్డే కప్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో 429 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్ తర్వాత పృథ్వీ షా గాయపడ్డాడు. అతను 2 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
ఈ యువ ఓపెనర్ దూకుడుగా ఆడుతుంటాడు. పృథ్వీ ఎలాంటి బౌలింగ్‌నైనా చిత్తు చేయగలడు. క్రీజులో ఉన్నంతసేపు చుక్కలు చూపిస్తాడు.
పృథ్వీ షా భారత్ తరపున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడాడు. పృథ్వీ షా 71 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1694 పరుగులు చేశాడు.
పృథ్వీ షా భారత్ తరపున 5 టెస్టు మ్యాచ్‌లు ఆడి 339 పరుగులు చేశాడు. పృథ్వీ షాకు టెస్టుల్లో 1 సెంచరీ ఉంది. పృథ్వీ షా 6 వన్డేల్లో 189 పరుగులు చేశాడు.