అనుష్క శర్మకు ఫొటోగ్రాఫర్‌గా మారిన అరిజిత్ సింగ్.. వైరల్ వీడియో..
15th OCT 2023
Pic credit - Instagram
ప్రపంచ కప్ 2023లో శనివారం భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైన పోటీ కనిపించింది. ఈ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది.
ఈ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది. వరుసగా 8విజయాలు సాధించింది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను చూసేందుకు బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కూడా వచ్చారు. ఇందులో ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్, విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పేర్లు కూడా ఉన్నాయి.
అరిజిత్, అనుష్కల మధ్య ఆసక్తికర సన్నివేశాన్ని కూడా అభిమానులు చూశారు. గ్రేట్ మ్యాచ్ మధ్యలో అరిజిత్ సింగ్ అనుష్క ఫోటోగ్రాఫర్‌గా మారాడు. ఈ వీడియో వైరల్ అయింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను ఫొటో తీయడం కనిపించింది. ఇందుకోసం అనుష్కను కూడా పోజులివ్వమని కోరాడు.
అనుష్క కూడా అరిజిత్ ప్రతిపాదనను తిరస్కరించలేదు. విజయ చిహ్నాన్ని చూపుతూ పోజులిచ్చింది. అరిజిత్ సింగ్ స్టైల్‌ని అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు.
శనివారం ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన గ్రేట్ మ్యాచ్‌కు ముందు అరిజిత్ సింగ్ కూడా నరేంద్ర మోదీ స్టేడియంలో అద్భుత ప్రదర్శన చేశాడు. అరిజిత్ సింగ్‌ను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు.
ఆయన షో టీవీలో ప్రసారం కాలేదు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మాత్రమే ఈ ప్రదర్శనను ఆస్వాదించారు. అనుష్కతో పాటు రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా టీమ్ ఇండియాకు మద్దతుగా స్టేడియానికి చేరుకుంది.