కోల్‌‌కత్తా కెప్టెన్‌గా ముంబై స్టార్ ప్లేయర్.. కోట్లు ఆఫర్ చేసిన కేకేఆర్?

TV9 Telugu

25 August 2024

ఐపీఎల్ తదుపరి ఎడిషన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. అందువలన అన్ని జట్లు కొన్ని పెద్ద పేర్లతో సహా అనేక మంది ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేస్తాయి.

తదుపరి ఎడిషన్‌కు ముందు వేలం

ఇదిలా ఉంటే, 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఏ ఆటగాళ్లను రిటైన్ చేస్తుంది. ఎవరిని విడుదల చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

 5 సార్లు ఛాంపియన్

ఇదిలా ఉంటే సూర్యకుమార్ యాదవ్ గురించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం, ముంబై ఫ్రాంచైజీ సూర్యను జట్టు నుంచి విడుదల చేస్తే, అతను ఏ జట్టులో చేరతాడు అనే రూమర్ మొదలైంది.

రూమర్

నివేదికల ప్రకారం, కోల్‌కతా నైట్ రైడర్స్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ వార్త హల్చల్ చేస్తోంది.

కెప్టెన్సీని ఆఫర్

సూర్యకుమార్ యాదవ్ 2018 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, అంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు.

2018 నుంచి ముంబైలోనే

సూర్యకుమార్ యాదవ్ 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 2 సెంచరీలు, 24 అర్ధ సెంచరీల సాయంతో 3594 పరుగులు చేశాడు.

150 ఐపీఎల్ మ్యాచ్‌లు

తాజాగా భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సూర్యకి సారథిగా మంచి స్టార్ట్‌ లభించింది.

భారత టీ20 జట్టుకు కెప్టెన్