28 May, 2025
Venkatachari
ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు చెలరేగిపోతుంటే, బౌలర్లకు పరుగుల కట్టడి సవాలుగా మారుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బౌలర్లు ఒక్కోసారి ఇలాంటి భారీ స్పెల్స్‌ను ఎదుర్కొనడం సర్వసాధారణం.
కొన్నిసార్లు అనుభవజ్ఞులైన బౌలర్లు సైతం పరుగుల వరదను ఆపలేక భారీగా పరుగులు సమర్పించుకుంటారు. అలా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్స్‌ను వేసిన బౌలర్లు ఎవరు? ఇప్పుడు చూద్దాం.
రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన జోఫ్రా ఆర్చర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకుని వికెట్ పడగొట్టలేకపోయాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు. షమీ భారత బౌలర్లలో అత్యంత ఖరీదైన స్పెల్ వేసిన బౌలర్‌గా నిలిచాడు.
మయాంక్ యాదవ్ స్థానంలో LSGలో చేరిన ఓ'రూర్కే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఈ చెత్త రికార్డును లిఖించుకున్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో మోహిత్ శర్మ గుజరాత్ టైటాన్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతూ 4 ఓవర్లలో 73 పరుగులు ఇచ్చాడు.
2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన బసిల్ థంపి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు.
2023 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన యష్ దయాల్ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 69 పరుగులు సమర్పించుకున్నాడు.