TV9 Telugu
26 January 2024
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియాలో ఎంపిక కాలేదు.
ఇదిలా ఉంటే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఫొటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.
మొహమ్మద్ సిరాజ్ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో, అతను గాయని ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లేతో కలిసి కనిపించాడు.
ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
నటుడు-గాయకురాలు జనై భోంస్లే ఇటీవల తన 23వ పుట్టినరోజును ముంబైలోని బాంద్రాలో జరుపుకుంది. ఆ తర్వాత కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో సిరాజ్‌తో ఉన్న ఫొటో కూడా ఉంది.
ఈ ఫొటోలో, మహ్మద్ సిరాజ్, జనై భోంస్లే ఒకరినొకరు నవ్వుతూ చూసుకుంటున్నారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం మాత్రమే కాకుండా మరేదో ఉందని అభిమానులు భావిస్తున్నారు.
నానమ్మ ఆశా భోంస్లే, నటుడు జాకీ ష్రాఫ్, క్రికెటర్లు సిద్ధేష్ లాడ్, శ్రేయాస్ అయ్యర్‌లతో ఉన్న ఫొటోలను కూడా జనై భోంస్లే పంచుకున్నారు. కానీ, సిరాజ్‌తో ఉన్న ఫొటోలు హెడ్‌లైన్స్‌లో ఉన్నాయి.
మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.12.75 కోట్లకు కొనుగోలు చేసింది.