ఐపీఎల్ చరిత్రలో అత్యంత కాస్లీ ప్లేయర్స్‌ వీళ్లే..

19 December 2023

TV9 Telugu

ఐపీఎల్ తొలి సీజన్‌ 2008లో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ధోనీ నిలిచాడు. రూ. 9.5 కోట్లతో ధోనీ సీఎస్‌కేలో చేరాడు. అప్పటి నుంచి వరుసగా ఐదుసార్లు సీఎస్‌కేకు నాయకత్వం వహించాడు. 

2009లో మాజీ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సను చెన్నై సూపర్ కింగ్స్‌ రూ. 9.80 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను సైతం రూ. 9.80 కోట్లు వెచ్చింది సీఎస్‌కే దక్కించుకుంది. 

2010లో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో కోల్‌కతాల నైట్‌ రైడర్స్‌ న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ షేన్‌ బాండ్‌ను రూ. 4.80 కోట్లకు దక్కించుకుంది. తొలి సీజన్‌లో షేన్‌ బాండ్‌ ఏకంగా తొమ్మది వికెట్లు తీసుకున్నాడు. ఇక ముంబై ఇండియన్‌ పొలార్డ్‌ను రూ. 4.80 కోట్లకు సొంతం చేసుకుంది. 

2011లో నిర్వహించిన వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గౌతమ్‌ గంభీర్‌ నిలిచాడు. కేకేఆర్‌ జట్టు గౌతమ్‌ను రూ. 14.90 కోట్లకు దక్కించుకుంది. ఇలా గౌతమ్‌ కోల్‌కతా జట్టులో 2012, 14లో చోటు దక్కించుకున్నాడు. 

2012లో నిర్వహించిన వేలం పాటలో భారత ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాను ఏకంగా రూ. 12.80 కోట్లకు సొంతం చేసుకుంది. చెన్నై మూడు సార్లు టైటిల్‌ను అందుకోవడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. 

2013లో నిర్వహించిన వేలం పాటలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ. 6.30 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత కింగ్స్‌ XI పంజాబ్‌ జట్టులోకి మారాడు. ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టులో ఉన్నాడు. 

2014 వేలంపాటలో యువరాజ్‌ సింగ్‌ ఆర్‌సీబీ నుంచి అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్‌ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇక 2015లో ఢిల్లీ జట్టు యువరాజ్‌కు రూ. 16 కోట్లు చెల్లించడం విశేషం. 

2016లో షేన్‌ వాట్సన్‌ను ఆర్సీబీ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ సీజన్‌లో ఆర్‌సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు వాట్సన్‌. 

2017లో బెన్‌ స్టోక్స్‌ను రైజింగ్ పుణె రూ. 14.50 కోట్లకు సొంతం చేసుకోగా 2018లో బెన్‌ స్టోక్స్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 14.50 కోట్లకు దక్కించుకుంది. 

2019లో జయదేవ్‌ ఉతద్కత్‌, వరుణ్‌ చక్రవర్తిని రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 8.40 కోట్లకు దక్కించుకుంది. 2020లో పాట్‌ కమిన్స్‌ను కేకేఆర్‌ రూ. 15.50 కోట్లకు దక్కించుకుంది. 

2021లో క్రిస్‌ మోరిస్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 16.50 కోట్లకు సొంతం చేసుకోగా, 2022లో ఇషాన్‌ కిషన్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ. 15.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక 2023లో సామ్‌ కుర్రాన్‌ను పంజాబ్‌ రూ. 18.50 కోట్లకు దక్కించుకుంది.