IPL 2025 మెగా వేలం పూర్తయింది, ఇందులో రిషబ్ పంత్ మరియు శ్రేయాస్ అయ్యర్ పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు.
పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి ఐపిఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
అయితే అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు వెచ్చించింది. దీంతో పంత్ తర్వాత లిస్ట్‌లో చేరాడు.
ఇటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరి మదిలో ఒకే ఒక ప్రశ్న ఉంది. టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేలంలోకి ప్రవేశించినట్లయితే, అతనికి ఎంత డబ్బు వచ్చేదంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
దీనికి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా సరదాగా సమాధానం ఇచ్చాడు.
రూ. 520 కోట్ల బడ్జెట్ కూడా వేలంలో బుమ్రాకు తక్కువే అంటూ ఆశిష్ నెహ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ మాట చెప్పి నెహ్రా నవ్వేశాడు.
ఆ తర్వాత మాట్లాడుతూ.. 520 కోట్లు కాదు, బుమ్రా ఈజీగా రూ. 30 కోట్ల వరకు రాబట్టగలడు. అయితే, ముంబై ఇండియన్స్ అతడిని రూ.18 కోట్లకు అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
జస్ప్రీత్ బుమ్రా తన IPL అరంగేట్రం నుంచి ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు. అప్పటి నుంచి అతను ఒక్కసారి కూడా వేలానికి రాలేదు. అయితే, తొలిసారిగా ముంబైకి అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.