టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్న స్టార్ ప్లేయర్.. కీలక పోస్ట్ షేర్ చేసిన భార్య

డేవిడ్ వార్నర్ టెస్ట్ కెరీర్ ముగింపు సంకేతాలు కనిపిస్తున్నాయి.

వార్నర్ భార్య క్యాండీస్ సోషల్ మీడియా పోస్ట్‌తో సూచన చేసింది.

టెస్ట్ క్రికెట్‌తో మా శకం ముగిసింది. ఇది సరదాగా ఉంది అంటూ పోస్ట్ షేర్ చేసింది.

యాషెస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో వార్నర్ ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించగలిగాడు.

హెడ్డింగ్లీ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోగా, వార్నర్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు.

దీంతో మాంచెస్టర్ టెస్టు నుంచి వార్నర్ ఔట్ అయినట్టేనని తెలుస్తోంది.

వార్నర్ 25 టెస్టు సెంచరీలు, 8343 పరుగులు చేశాడు.