07 jULY 2023
Pic credit - Freepik
29 August 2023
Pic credit - Instagram
ఆసియా కప్ 16వ సీజన్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ పాకిస్థాన్, శ్రీలంకలో జరగనుంది.
ఏ మ్యాచ్ ఓడిపోకుండా ఒక జట్టు ఆసియా కప్‌ను గెలవడం కేవలం 6 సార్లు మాత్రమే జరిగింది.
ఇందులో ముగ్గురు భారత కెప్టెన్లు ఉన్నారు. వారి నాయకత్వంలో టీమిండియా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఆసియా కప్‌ను గెలుచుకుంది.
1984లో సునీల్ గవాస్కర్ సారథ్యంలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది,
2016లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌లో ధోనీ సారథ్యంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది.
2018లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత జట్టు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. కానీ, ఒక మ్యాచ్ డ్రా అయింది.
రోహిత్ శర్మ మరోసారి తన 2018 ప్రదర్శనను పునరావృతం చేసే అవకాశం ఉంది. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో విజయం కోసం టీమిండియా అతిపెద్ద పోటీదారుగా పరిగణిస్తున్నారు.
రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా సెప్టెంబర్ 2న పాకిస్తాన్ టీంను ఢీకొట్టనుంది. ఈపోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.