ఆసియాకప్‌లో ఖాతా తెరవని టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?

19 August 2023

Pic credit - Instagram

ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఆసియా కప్‌లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 

ఆగస్టు 30 నుంచి ఆసియా కప్

అయితే ఈ టోర్నమెంట్‌లో ఖాతా తెరవలేకపోయిన టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒకరు ఉన్నారని మీకు తెలుసా?

ఖాతా తెరవని ప్లేయర్

ఈ భారత ఆటగాడు మరెవరో కాదు, తుఫాను బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్.

యూసుఫ్ పఠాన్

యూసుఫ్ 2008 నుంచి 2012 వరకు ఆసియా కప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా ఖాతా తెరవలేకపోయాడు. ఇది వన్డే ఆసియా కప్‌కి సంబంధించినది గణాంకాలు.

5 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్

యూసుఫ్ 5 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతను బ్యాటింగ్ చేసే అవకాశం ఒక్కసారి మాత్రమే వచ్చింది. అందులో అతను 4 బంతుల్లోనే ఔట్ అయ్యాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.

బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలే..

వన్డే ఫార్మాట్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక సార్లు సున్నా వద్ద ఔట్ అయిన రికార్డు బంగ్లాదేశ్‌కు చెందిన రూబెల్ హొస్సేన్ పేరిట ఉంది. అతను ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడుసార్లు ఔట్ అయ్యాడు.

రూబెల్ హొస్సేన్ పేరిట చెత్త రికార్డ్..

రుబెల్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన సల్మాన్ బట్, బంగ్లాదేశ్‌కు చెందిన అమీనుల్ ఇస్లాం, శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే కూడా వన్డే ఆసియా కప్‌లో తలా మూడుసార్లు ఔట్ అయ్యారు.

చెత్త లిస్టులో ఎవరున్నారంటే..